Thursday, 4 September 2014

సంపూ ‘కొబ్బరి మట్ట’కి అదిరిపోయే శాటిలైట్ ఆఫర్స్.!




‘హృదయ కాలేయం’ అనే సినిమాతో బర్నింగ్ స్టార్ గాసోషల్ నెట్వర్కింగ్ లో సంచలనం సృష్టించిన హీరో సంపూర్నేష్ బాబు. తను చేసిన మొదటి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా శాటిలైట్ రైట్స్ పరంగా కూడా మంచి రేటు పలికింది. ఇప్పుడు ఇదే క్రేజ్, అదే డిమాండ్ సంపూర్నేష్ బాబు నటిస్తున్న ‘కొబ్బరి మట్ట’ కి కూడా నెలకొంది.
సంపూర్నేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ లో పెదరాయుడు, పాపారాయుడు మరియు ఆండ్రాయిడ్ అనే మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో సంపూ సరసన ఏడుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కోసం ప్రస్తుతం తెలుగు టీవీ చానల్స్ మధ్య శాటిలైట్ రైట్స్ కోసం గట్టి పోటీ జరుగుతోంది. మరి చివరికి ఏ చానల్ దక్కించుకుంటుందో అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే సంపూర్నేష్ బాబుపై ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేయడం మొదలు పెట్టారు. ఆ పాటని త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రొనాల్డ్ డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీ రోల్ చేస్తున్న ఈ మూవీకి కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...